గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (12:29 IST)

రేప్ ఆరోపణలు.. పోలీసు కేసులున్న రాందేవ్‌కు పద్మ అవార్డా?

కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పేరు ఉండటాన్ని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసు కేసులు, అత్యాచార ఆరోపణలు ఉన్న రాందేవ్‌కు అంత ఘనమైన పురస్కారాన్ని ఎలా ఇస్తారని సామాజిక వెబ్‌సైట్లలో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
చాలా యేళ్ళ తర్వాత బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. ఈ ప్రభుత్వం తొలిసారిగా 'పద్మ' అవార్డులను ప్రకటిస్తూ, పలువురు గురువులను, హిందూ మఠాధిపతులను, బీజేపీ నాయకులను, గతంలో వారికి సహకరించిన వారినీ జాబితాలో చేర్చడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ముఖ్యంగా యోగా గురు బాబా రాందేవ్‌‌కు పద్మభూషణ్ ఇవ్వడంపై ఎందరో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాందేవ్ బాబా పద్మభూషణ్‌కు అర్హుడైతే ఖచ్చితంగా నేను కూడా భారతరత్నకు అర్హుడినే అని ఒకరు, దొంగ బాబాకు అవార్డు ఇచ్చి మోడీ ప్రభుత్వం దొంగ అయిపొయింది అని ఇంకొకరు, రాందేవ్‌కు అవార్డు ఇచ్చిన తర్వాత మోడీ సాధించిన విజయాలు వెనక్కిపోయాయి అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు.