బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 26 డిశెంబరు 2018 (18:18 IST)

కన్నుమూసిన కాన్పుల నర్సమ్మ..

కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని బాగా ప్రాచూర్యం ఉన్న పేరు నర్సమ్మ. ఈమె వయస్సు 98 సంవత్సరాలు. ఆమె పేరొందిన గైనకాలజిస్ట్ కాదు, ఎం.బి.బి.ఎస్ పట్టా పుచ్చుకోనూలేదు. కానీ ఎంతో చాకచక్యంగా ఓర్పుగా సిజేరియన్ అవసరం లేకుండా ఏకంగా 16 వేలకు పైగా సహజ కాన్పులు చేసింది నర్సమ్మ. 
 
కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని తుమకూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన నరసమ్మ వైద్య చికిత్సలు ఏమాత్రం అందుబాటులో లేని కాలం నుంచే సహజ కాన్పులు చేస్తూ వచ్చారు. ఎంతోమంది పేద మహిళలకు మాతృత్వ మధురిమను పంచిన సొలగిత్తి నరసమ్మను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 
 
గత కొద్ది నెలలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని బీజీఎస్‌ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న నర్సమ్మ మంగళవారం కన్నుమూశారు. కర్నాటక  రాష్ట్ర ప్రభుత్వ నర్సమ్మకు వైద్య ఖర్చులు భరించి చికిత్స చేయించింది. నర్సమ్మ మృతి పట్ల పలువురు తమ విచారం వ్యక్తంచేశారు.