గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (11:15 IST)

పాకిస్థాన్‌కు అరుణ్ జైట్లీ డెడ్లీ వార్నింగ్: బీ కేర్‌ ఫుల్!

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. సాహసాలు చేయాలనుకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు.
 
"మా చేతుల్లో డాలు మాత్రమే కాదు... కత్తులు కూడా ఉన్నాయి... బీ కేర్ ఫుల్" అంటూ జైట్లీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా పాక్ దాడి చేసిన ప్రతిసారీ రక్షణాత్మక ధోరణితో వ్యవహరించామని... ఇకపై ఎదురు దాడి చేస్తామని హెచ్చరించారు. 
 
సరిహద్దులో శాంతి నెలకొనేందుకు ఏం చేసినా తనకు అభ్యంతరం లేదని ఇప్పటికే భారత సైన్యానికి ప్రధాని మోడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.