Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబై తరహా ఉగ్రదాడికి ప్లాన్.. పాక్ నుంచి 20 మంది ముష్కరులు.. నిఘా వర్గాల హెచ్చరిక

బుధవారం, 31 మే 2017 (08:43 IST)

Widgets Magazine
Terrorist

దేశవాణిజ్య రాజధాని ముంబైలో మరోమారు మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్లాన్ వేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాదాపు 20 నుంచి 25 మంది వరకు భారత్‌లోకి చొచ్చుకువచ్చారని కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. 
 
ఈ ముష్కర మూకలు పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని పట్టణాల్లోగానీ, దేశంలోని ఏదైనా మెట్రో నగరంలోగానీ దాడి చేసే అవకాశం ఉందని తెలిపాయి. పర్యాటక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్‌, హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, గత 2008 సంవత్సరం నవంబరు 26వ తేదీన పది పాక్ ముష్కరులు ముంబైలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ దాడిలో సమారు 165 మంది ముంబై వాసులతో పాటు 9 మంది ముష్కరులు హతమయ్యారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో వీరు దాడులకు పాల్పడ్డారు. ప్రాణాలతో పట్టుబడిన మరో ఉగ్రవాది కసబ్‌ను ఉరితీయడం జరిగింది. ఈ దాడులకు జహీర్ రెహ్మాన్ లఖ్వీ ప్రధాన సూత్రధారి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Plan India Mumbai Attack Pakistani Terror Groups

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెలవు తీసుకున్న చిత్రసీమ అంబేద్కరుడు..ఈ సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు

నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా, సామాజిక, రాజకీయ రంగాల్లో అడుగడుగునా తన పాద ముద్ర ...

news

చిత్రసీమ పెద్దాయన కడసారి చూపు కోసం తరలి వస్తున్న చిత్రసీమ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమ మేరుపర్వతం సెలవు తీసుకుంది. అనారోగ్యంతో నెలల తరబడి తలపడి పోరాడిన ...

news

దాసరి మరణం జీర్ణించుకోలేకపోతున్నా: భోరున విలపించిన మోహన్‌ బాబు

తనకు నటుడిగా జీవితానిచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ...

news

తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలి: మండలి బుద్ధప్రసాద్

అమరావతి : తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. ...

Widgets Magazine