శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (16:30 IST)

జయ కోసం జైలు వద్దే సీఎం పన్నీర్ సెల్వం... 6 కాదు రేపే విచారణ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను బెయిల్ పై ఎలాగైనా బయటకు తీసుకురావాలన్న పట్టుతో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ ఇంటికి సైతం వెళ్లకుండా నేరుగా బెంగళూరు విమానమెక్కి జయ ఉన్న జైలుకు వెళ్లారు. ఐతే జైలు సందర్శన వేళలు ముగియడంతో జైలు వద్దే ఓ హోటల్ లో బస చేసి ఉదయాన్నే మళ్లీ వెళ్లారు. 
 
కోర్టుకు కూడా జయలలిత ఆరోగ్యం విషయం... తదితర కారణాలను విన్నవించారు. దీంతో జయలలిత దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ చేపట్టేందుకు సమ్మతించింది. కాగా, ఈ ఉదయం జయ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 6కి కర్ణాటక హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.