Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పులి'గా మారిన 'పిల్లి'.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరో అయిపోయిన పన్నీర్‌

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:40 IST)

Widgets Magazine
opanneerselvam

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఒక్కసారి సోషల్ మీడియాలో రియల్ హీరోగా మారిపోయారు. ముఖ్యంగా నిన్నటి వరకు పిల్లిగా ఉన్న ఒక్కసారి పులిలా మారిపోయాడన్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
అమ్మ జ‌య‌ల‌లిత వీర విధేయుడి తిరుగుబాటుతో అన్నాడీఎంకే ముఖచిత్రం మారిపోతోంది. త‌న బ‌ల‌మేంటో త్వ‌ర‌లోనే అంద‌రికీ తెలుస్తుంద‌ని ముఖ్య‌మంత్రి పన్నీర్‌ సెల్వం స‌వాల్ విస‌ర‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హీరో అయిపోయారు. 
 
మంగళవారం సాయంత్రం వరకు ప‌న్నీర్ సెల్వం ర‌బ్బ‌రు స్టాంపులాంటి వార‌ని నెటిజ‌న్లు జోకులు పేల్చుకున్నారు. స్త్రీల‌కు లేచి నిలబడి సీటు ఇచ్చే సంస్కారం ఉన్నవార‌ని సెటైర్లు వేశారు. కానీ, పన్నీరు సెల్వం తీరు మార్చుకొని త‌న అస‌లు స్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో బుధవారం ఆయ‌న‌పై నెటిజ‌న్లు కూడా తీరు మార్చుకొని ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఆయనను హీరోగా పేర్కొంటున్నారు.
 
ప‌న్నీర్‌ సెల్వంకు మద్దతుగా ప్రజలతో పాటు పలువురు డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కూడా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మెరీనా బీచ్ వ‌ద్ద ప్రారంభించిన తిరుగుబాటులో ప‌న్నీర్ సెల్వం గెలిచి తీరుతార‌ని ఓ అభిమాని పేర్కొన్నాడు. అన్ని విషయాలను పన్నీర్ సెల్వం బయటకు చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Panneerselvam Hero Netizens Marina Declaration

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ సీఎం కారాదు... పన్నీరుకు మద్దతిద్దామా? వద్దా? నేతలతో స్టాలిన్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు ఆపద్ధర్మ ...

news

అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. అమ్మను ఆస్పత్రిలో నన్ను చూడనివ్వలేదు: పన్నీర్ సెల్వం

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు ...

news

అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదు... పన్నీర్ వ్యాఖ్యలపై శశికళ స్పందించాలి: ఎంకే.స్టాలిన్‌

అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదనీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ ...

news

దీపతో కలిసి పనిచేసేందుకు సై.. జయలలిత మేనకోడలిగా ఆమెకు ఆ అర్హత ఉంది: ఓపీ

దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపతో కలిసి పనిచేసేందుకు సై అని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ...

Widgets Magazine