ఆర్కే నగర్‌ రేసులో అమ్మ నమ్మినబంటు.. తెలుగు వ్యక్తి మధుసూధన్

శుక్రవారం, 17 మార్చి 2017 (09:58 IST)

ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే మాజీ ప్రిసీడియం ఛైర్మన్ ఇ.మధుసూదన్ పోటీ చేయనున్నారు. అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో మధుసూదన్ పోటీ చేస్తారని ఓపీఎస్‌ గురువారం ప్రకటించారు. 
 
ఉత్తర చెన్నైలో ఉన్న ఆర్కే నగర్‌లో తెలుగువారు అధికంగా ఉండడం, మధుసూదన్‌కు అక్కడ పరిచయాలు అధికంగా ఉండటంతో అక్కడి నుంచి బరిలోకి దించాలని ఓపీఎస్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ... ఆర్‌కే నగర్‌లో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
ఇకపోతే.. అన్నాడీఎంకే నేతల్లో జయ ఆగ్రహానికి గురికాని ఏకైక వ్యక్తి మధుసూధన్. జయకు నమ్మినబంటు. అందుకే ఎంతమందిని ఎన్ని పదవుల నుంచి మార్చినా మధుసూదన్‌ను మాత్రం శాశ్వతంగా ప్రిసీడియం చైర్మన్ పదవిలోనే జయ ఉంచారు. అయితే ఆమె మరణానంతరం ఓపీఎస్‌ బృందంతో జతకట్టిన మధుసూదన్... శశికళపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్కే నగర్‌లో దినకరన్ గెలిస్తే.. ఎడప్పాడి పళనిస్వామికి సీఎం పదవికి ఎసరు తప్పదా?

ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా టీటీడీ దినకరన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ...

news

రోజా మళ్లీ నోరు తెరిచావో అసెంబ్లీలోకి రాలేవు: మెడపై మరో ఏడాది సస్పెన్షన్ కత్తి

ప్రివిలెజ్ కమిషన్ సిఫార్సును స్పీకర్ శుక్రవారం నుంచే అమలు చేయవచ్చు. లేదా అసెంబ్లీలో రోజా ...

news

పరాయి మహిళతో ఉపాధ్యాయుడి అక్రమ సంబంధం.. భర్త ఇంట్లో లేని సమయంలో?

ఓ ఉపాధ్యాయుడు పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. నాగర్ ...

news

వీళ్లకేం పోయేకాలం. మహిళల బాత్‌రూమ్‌ను కూడా వదలరా.. ఖర్మ

మహిళల బాత్‌రూమ్‌లో మగాళ్లు దూరితే.. సినిమాలో అయితే హాయిగా చూసి నవ్వుకునే దృశ్యాలతో ...