బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:52 IST)

శశికళకు పన్నీర్ షాక్ : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇ.మధుసూదనన్

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తేరుకోలేని షాకిచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ పన్నీర్ సెల్వం ఆదేంచారు. పైగా, తనకు అండ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తేరుకోలేని షాకిచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ పన్నీర్ సెల్వం ఆదేంచారు. పైగా, తనకు అండగా నిలిచిన పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ ఇ.మధుసూదనన్‌ను పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు గురువారం ప్రకటించారు. పైగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, అన్నాడీఎంకే సీనియర్ పీహెచ్ పాండియన్ కూడా శశికళ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ పని రెండు రోజుల్లో క్లోజ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా శశికళకు చెక్ చెప్పే దిశగా పన్నీరు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. శశికళపైన పన్నీరు సెల్వం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శశికళ ముఖ్యమంత్రి అయితే అది మాయని మచ్చ అవుతుందన్నారు. మధుసూదన్ తమ వైపు రావడం ఎంతో బలం అన్నారు. మధుసూదన్‌ను శశికళ వర్గం బెదిరించిందని తీవ్ర ఆరోపణలు చేశారు.