శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మే 2016 (16:28 IST)

సంతానం ప్రసాదిస్తానని లైంగిక వేధింపులు.. యూపీలో దొంగ బాబా అరెస్ట్!

నకిలీ బాబాల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. మూఢనమ్మకాల కారణంగా నకిలీ బాబాలను ప్రజలు నమ్మేస్తున్నారు. టెక్నాలజీ దూసుకెళ్తున్నప్పటికీ కుగ్రామాల్లో మాత్రమే కాకుండా కొన్ని నగర శివార్లలో ఇంకా బాబాల ప్రాబల్యం తగ్గట్లేదు. అయితే బాబాలు స్వామీజీల ముసుగుతో చేసే అరాచకాలు వెలుగులోకి రావడం, అరెస్ట్ కావడం సర్వసాధారణమైపోయింది. 
 
తాజాగా ''గాడ్ మెన్'' బాబాగా పేరొందిన పరమానంద్ స్వామీజీని ఉత్తరప్రదేశ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. నగరానికి చేరువలోని బాబా ఆశ్రమం బరాబంకిలో సంతానాన్ని ప్రసాదిస్తానని రామ్ శంకర్ తివారీ అలియాస్ పరమానంద్ బాబా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఆశ్రమంపై దాడి చేసిన పోలీసులు బాబాను అరెస్ట్ చేశారు. మహిళలను అశ్లీలంగా చిత్రికరించిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడి చేశారని తెలుసుకున్న బాబా ఉడాయించడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్‌లోని సత్నా దొంగ బాబాను అరెస్ట్ చేశారు. ఈ బాబా వందమంది మహిళలను లైంగికంగా వేధించాడని ప్రాథమిక విచారణలో తేలింది.