శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:21 IST)

కటిక నేలపై అన్నం, పప్పు, కూర పడేసి వెళ్లిన వార్డ్ బాయ్.. ఆత్రుతతో ఆరగించిన రోగి... రాంచీ ఆస్పత్రిలో దారుణం

అది రాష్ట్ర రాజధానిలో ఉన్న పెద్దాసుపత్రి. కానీ ఆ ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఖచ్చితంగా మానవత్వం ఉన్నవారి గుండె పగిలిపోతుంది. ఎందుకంటే.. ఆస్పత్రిలోని కటిక నేలపై పడేసిన అన్నం, పప్పు, కూరను ఓ రో

అది రాష్ట్ర రాజధానిలో ఉన్న పెద్దాసుపత్రి. కానీ ఆ ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఖచ్చితంగా మానవత్వం ఉన్నవారి గుండె పగిలిపోతుంది. ఎందుకంటే.. ఆస్పత్రిలోని కటిక నేలపై పడేసిన అన్నం, పప్పు, కూరను ఓ రోగి ఆరగించడం చూసిన ఘటన ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మన దేశంలోని ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు ఉండటం లేదని అందరూ వాపోతున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఆ రాష్ట్ర రాజధాని నగరం రాంచీలో ఉంది. ఈ ఆస్పత్రి నిర్వహణ కోసం యేటా రూ.300 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తారు. పైగా దీనికి ఓ మంచి పేరు కూడా ఉంది. అంటేంటే... రాంచీ వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ. అక్కడికి చికిత్స కోసం పల్మాటీ దేవి అనే మహిళ వచ్చారు. ఆమె ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 
 
ఆమెకు బుధవారం ఆసుపత్రి వార్డ్ బాయ్‌లు భోజనం పెట్టారు. అన్నం, పప్పు, కూర వడ్డించారు. ఆమె వాటిని తింటున్నారు. కానీ ఆ దృశ్యాన్ని చూసినవాళ్ళకు తీవ్ర ఆవేదన కలిగింది. ఓ పత్రిక విలేకరి ఆ సన్నివేశాన్ని తన కెమెరాలో బంధించి, ప్రపంచానికి చూపించారు.
 
ఆ అభాగ్య మహిళ తన సొంత ప్లేటు తెచ్చుకోలేకపోయారు. వార్డ్ బాయ్‌ని అడిగితే లేదు పొమ్మన్నాడు. కటిక నేలపైనే అన్నం, పప్పు, కూర పడేసి వెళ్ళిపోయాడు. రెండు చేతులకు బ్యాండేజిలతో ఉన్న ఆమె మరో దారి లేక అక్కడి అన్నాన్నే నోట్లో వేసుకుని ఆకలిబాధను తీర్చుకుంది.