Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షార్ సెంటర్ నుంచి గం. 5.30 నిమిషాలకు 'బాహుబలి' జీశాట్-19, త్వరలో రోదశిలోకి మానవుడు...

సోమవారం, 5 జూన్ 2017 (15:42 IST)

Widgets Magazine

ఇస్రో చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆ చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రపంచానికి బాహుబలి తన స్టామినా ఎలా చూపిందో... అదే రీతిన ప్రపంచ దేశాలు మనవైపే చూసే తొలి ప్రయోగం ఇవాళ జరుగుతోంది. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(జీఎస్‌ఎల్‌వీ) మార్క్-3 డీ1 ప్రయోగానికి మరికొన్ని గంటలే మిగిలి వున్నాయి.
GSLV MK III


సుమారు నాలుగు టన్నుల అంతరిక్ష వాహక నౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. షార్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకనున్న ఈ రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నారు. 43.43 మీటర్ల ఎత్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ1 ప్రయోగం 16:20 నిమిషాల్లో పూర్తవుతుంది.
 
ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో దీన్నంతా బాహుబలి 1 అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్తలు కాదు సుమా. బయటి జనం. దీని ప్రయోగంతో ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ అంతరిక్ష నౌక కోసం 18 ఏళ్లుగా శ్రమిస్తున్నారు. దీనికి రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. భారతదేశం తన సొంతగడ్డ పైనుంచి తొలిసారి ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహం కూడా ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. 
 
ఇది రోదసి నుంచి ఇంటర్నెట్ సేవలందించనున్న తొలి దేశీయ శాటిలైట్. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జీశాట్-19ని ప్రయోగిస్తున్నామనీ, ఇది కేవలం ఓ ట్రైలర్(బాహుబలి1) అనీ అసలు సినిమా(బాహుబలి2) అంతా మరికొద్ది నెలల్లో ప్రయోగించనున్న జీశాట్-11దేనని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తానికి ఈ బాహుబలి 1 కోసం ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తోంది. మనమూ చూద్దాం మరికొన్ని గంటల్లోనే...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Baahubali Isro Satellite Heaviest Rocket

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రపంచ దేశాలు ఇకనైనా మేల్కోండి... సిరియన్ బాలుడి ఆవేదన (Video)

సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాష్టీకాలు అంతా ఇంతా కావు. మహిళలు, చిన్నారులని తేడా లేకుండా ...

news

చైనాకు వెళ్లడంతోనే గుంటూరుకు రాలేదా..? చిరంజీవి పార్టీ నుంచి దూరమయ్యారా?

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ ...

news

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై తగ్గని అకృత్యాలు.. బీహార్‌లో 17ఏళ్ల బాలుడు ఓ యువతిని?

ఉత్తరప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ...

news

ఊరకుంటలో శవమై తేలిన ఇద్దరు టీచర్లు.. ఆత్మహత్యా? హత్యా?

ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా ...

Widgets Magazine