గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:58 IST)

సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపండి : సుప్రీంలో పిల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడుకు చెందిన సత్తా పంచాయత్ ల్యాకం అనే స్వచ్చంద సంస్థ ప్రధాన కార్యదర్శి సెంథిల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడుకు చెందిన సత్తా పంచాయత్ ల్యాకం అనే స్వచ్చంద సంస్థ ప్రధాన కార్యదర్శి సెంథిల్ సుప్రీం కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు.
 
ఆదాయానికి ముంచి ఆస్తులు సంపాదించిన కేసులో ముఖ్యమంత్రి దివంగత జయలలితతో పాటు శశికళలు ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయంతెల్సిందే. ఈ అక్రమాస్తుల కేసు తీర్పు వారంలోగా రానున్న నేపథ్యంలో అంతవరకు శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యకుండా అడ్డుకోవాలని ఆ పిల్‌లో పేర్కొన్నారు.
 
జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై వారంలో తీర్పు వెలువరించే అవకాశం ఉందని సుప్రీం కోర్టు సంకేతాలు ఇచ్చిన వెంటనే స్వచ్చంద సంస్థ కార్యదర్శి సెంథిల్ సుప్రీం కోర్టులో శశికళకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయడం గమనార్హం. 
 
శశికళ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆమె నిందితురాలు అని కోర్టు తీర్పు ఇస్తే మళ్లీ తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి వస్తారని, ఇలా జరిగితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సెంథిల్ సుప్రీం కోర్టులో మనవి చేశారు. ఈ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరుగనుంది.