గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (10:55 IST)

నేపాల్ పర్వతాల్లో అదృశ్యమైన విమానం: 21మంది ప్రయాణీకులు ఏమయ్యారు?

నేపాల్ పర్వతాల్లో బుధవారం ఉదయం బయలుదేరిన ఓ విమానం అదృశ్యమైంది. అదృశ్యమైన విమానంలో దాదాపు 21 మంది ప్రయాణికులు ఉన్నారు. నేపాల్‌లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలెట్లతో సంబంధాలు తెగిపోయాయని, ఆపై విమానం ఎటు వెళ్లిందన్న విషయం పసిగట్టలేకపోయాయని ఎయిర్‌ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
 
పొఖారా నుంచి ఉదయం 7:45కు బయలుదేరిన విమానం జామ్ సోమ్‌కు వెళ్లాల్సి ఉంది. గమ్యానికి చేరాల్సిన విమానం కనుమరుగవడంతో ప్రయాణికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ పర్వతాలలో చిక్కుకుని ఈ విమానం కనిపించకుండా పోయి ఉండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సిబ్బంది విమానాల సహాయంతో సెర్చి చేయడం ప్రారంభించారు.