మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (19:13 IST)

సీఎం సీట్లో కూర్చొనేందుకు ఆరోగ్యం భేష్.. జైలుకెళ్లేందుకు అనారోగ్యం.. శశికళ

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శశికళ షాక్ తిన్నారు. దీంతో ఆమె కొత్త సీన్‌కు తెరలేపారు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, లొంగిపోయేందుకు నాలుగు వారాల

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ పాటు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శశికళ షాక్ తిన్నారు. దీంతో ఆమె కొత్త సీన్‌కు తెరలేపారు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 
 
దీనిపై ఆమె ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. శశికళ కొత్త డ్రామాకు తెరలేపారని ఆమె వ్యతిరేకవర్గాల నుంచి గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉవ్విళ్ళూరిన శశికళ.. ఇపుడు జైలుకెళ్లేందుకు మాత్రం ఆమె ఆరోగ్యం బాగోలేదని చెప్పడం దొంగ నాటకమని వారు ఆరోపిస్తున్నారు. 
 
అంతేకాకుండా, శశికళ కోరిక మేరకు.. నాలుగు వారాలు సమయం ఇస్తే మాత్రం తమిళనాడులో అల్లకల్లోలం సృష్టిస్తారని, ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఎంతమాత్రం మన్నించరాదని కోరుతున్నారు. జైలుశిక్షలు పడిన చాలామంది నేతలు ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి అనారోగ్యం పేరిట నాటకాలకు తెరలేపడం చూస్తూనే ఉన్నామని, అందువల్ల సుప్రీంకోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.