ఎంపీలు - ఎమ్మెల్యేలకు మోడీ షాక్.. బ్యాంకు ఖాతా వివరాల వెల్లడికి ఆదేశం

మంగళవారం, 29 నవంబరు 2016 (12:42 IST)

Narendra Modi

దేశంలోని నల్లకుబేరులకు షాకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇపుడు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లతో పాటు.. చిల్లర కష్టాలు ఉత్పన్నమయ్యాయి.  
 
పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ‍్మెల్యేలు అందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు సమర్పించాలని సూచించారు. అలాగే బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లంచాలని ఆదేశించారు.
 
ఈ నెల 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ‍్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోడీ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొలంబియా విమాన ప్రమాదం... ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులతో సహా 81 మంది మృతి

బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. ఆ దేశానికి ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన క్రీడాకారులంతా ...

news

ఏపీలో టీడీపీ - బీజేపీ స్నేహబంధానికి కటీఫ్? ఆ పత్రిక సర్వే ఫలితమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ స్నేహబంధానికి కటీఫ్ ఏర్పడే పరిస్థితులు ...

news

రమ్య మళ్లీ వివాదంలో చిక్కుకుంది.. యువకుడితో వాగ్వివాదం.. అనుచరులతో దాడి..

మాజీ కాంగ్రెస్ ఎంపీ, నటీమణి రమ్య మళ్ళీ వివాదంలో చిక్కుకుంది. ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన ఓ ...

news

అర్థరాత్రి బయటకు పంపి గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తున్న అన్న.. చంపేసిన తమ్ముడు

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట ...