శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2015 (20:15 IST)

ప్రధాని మోదీ చొరవతో ఆరు దశాబ్దాల వేర్పాటు వాదానికి నాగా గ్రూప్ స్వస్తి

ఆరు దశాబ్దాల నుంచి నాగాలాండ్ లో వేర్పాటువాద గ్రూప్ నాగా వేర్పాటువాద పోరాటం చేస్తూనే ఉంది. దీనికి ఈరోజు స్వస్తి చెపుతూ ఒప్పందం చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ చొరవతో 'నాగా'తో కేంద్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు నాగా వేర్పాటువాద నేతలు ప్రకటన చేశారు. కాగా ఈ ఒప్పందం 18 నెలల్లో అమలులోకి వస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగాతో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ద్వారా గాంధీజీ నడిచిన బాట అయిన అహింసపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయిందని అన్నారు. భుజంభుజం కలిపి అభివృద్ధి బాటలో పయనించేందుకు ముందుకు వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన నాగా నేతలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.