శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (10:34 IST)

అమెరికాకు మోడీ.. 26న డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ.. హెచ్1బీ వీసా అంశంపై చర్చలు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 26న తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో హెచ్‌1బి వీసాల అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించడంపై నిరసన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 26న తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో హెచ్‌1బి వీసాల అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.  
 
హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత కొనసాగటానికి భారత్‌ ప్రాముఖ్యతను గుర్తించిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ "భారత్‌ మా ప్రధాన రక్షణ భాగస్వామి"అని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈనెల 25న అమెరికా పర్యటనకు బయలుదేరుతారని విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారంనాడు వెల్లడించింది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండటం ఇదే ప్రథమం. ప్రాంతీయ భద్రత, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులూ చర్చకు రావచ్చని సమాచారం.