Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడీ విదేశీ టూర్ ఖర్చులడిగితే... ప్రశ్నలో అస్పష్టత ఉందంటూ జవాబు దాటేసిన పీఎంఓ!

ఆదివారం, 16 జులై 2017 (12:47 IST)

Widgets Magazine
Nutan Thakur

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చులు ఇవ్వండి అంటూ సమాచార హక్కు ఉద్యమకారిణి నూతన్ ఠాకూర్ ప్రధానమంత్రి కార్యాలయ అధికారులను కోరారు. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇష్టంలేనీ పీఎంవో... వేసిన ప్రశ్నలో అస్పష్టత ఉందని పేర్కొంటూ జవాబును దాటవేసింది. పైగా, పిఎంఓ డైరెక్టర్ సయ్యద్ ఎక్రామ్ రిజ్వీని కలవాలంటూ ఓ ఉచిత సలహా ఇచ్చింది. 
 
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాల్లో పర్యటించడం కంటే.. విదేశాల్లో పర్యటించేందుకే అధికంగా ఇష్టపడుతున్నారు. ప్రధానంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, వివిధ దేశాలతో స్నేహభావం పెంపొందించేందుకే ఈ పర్యటనలు చేస్తున్నట్టు మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. 
 
అయితే, ప్రధాని విదేశీ పర్యటనల సందర్భంగా ఎంత ఖర్చవుతుంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. సరిగ్గా ఇటువంటి సమాచారాన్నే తెలుసుకుందామనుకున్న నూతన్ ఠాకూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మాజీ ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులను ఆమె కోరారు.
 
దీనికి సంబంధించి 2010 నుంచి ఇప్పటివరకూ ఉన్న సమాచారం కావాలని అభ్యర్థించారు. అయితే సమాచారం ఇచ్చేందుకు పీఎంఓ అధికారులు నిరాకరించారు. పైగా ఈ ప్రశ్నలో అస్పష్టత ఉందని ఆరోపించారు. పీఎంఓ అధికారి ప్రవీణ్ కుమార్ ఈ సమాచారాన్ని అందించేందుకు నిరాకరిస్తూ, దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలో అస్పష్టత ఉందని పేర్కొన్నారు. పైగా, పీఎంవో డైరక్టర్‌ను కలవాలని సూచించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అదృష్టమో... దురదృష్టమో ఆ మంత్రి నారా లోకేష్... బుట్టా రేణుక

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేశ్‌ను అభివృద్ధి పనుల విషయంగానే తాను ...

news

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ...

news

గోవును చంపితే 14 యేళ్ళు.. మనిషిని చంపితే రెండేళ్లు : న్యాయ వ్యవస్థలో లోపాలు

దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను పలువురు న్యాయకోవిదులు ఎత్తిచూపుతున్నారు. ఎందుకంటే.. గోవును ...

news

దావూద్ గ్యాంగ్‌‌తో అబు అజ్మీకి లింకులు : అమర్ సింగ్

సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీకి అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు ...

Widgets Magazine