బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (15:16 IST)

కార్మికుల డిమాండ్లు తీర్చకుంటే ఓటమి ఖాయం.. ప్రహ్లాద్ మోడీ హెచ్చరిక...!

దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబైలో స్థానిక ఆజాద్ మైదాన్‌లో జరిగిన చౌకధరల దుకాణదారుల ఉద్యమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత చౌకధరల దుకాణదారుల జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రహ్లాద్ మోడీ ఉన్నారు. 
 
ప్రజల అవసరాలు, కార్మికులు, డీలర్ల డిమాండ్లను పరిష్కరించక పోతే చిత్తుగా ఓడించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. అయితే, తన పోరాటం అన్న మోడీపై కాదనీ, ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థపై అంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఒక్కో రేషన్ డిస్ట్రిబ్యూటర్‌కు కనీసం 1000 కార్డుదారులు ఉండాలని, కమీషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

గత యూపీ ఎన్నికల్లో సుమారు 75 వేల మంది డీలర్లు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని, అందువల్లే 73 స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగిందని గుర్తు చేశారు. తక్షణం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు.