గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (11:24 IST)

లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇంద్రాణి.. సాధారణ ఖైదీగా.. చాప మీద..?

లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇంద్రాణి ప్రస్తుతం సాధారణ ఖైదీ జీవితాన్ని గడుపుతోంది. లగ్జరీ కార్లు, పిలిస్తే పరిగెత్తుకొచ్చే పనివాళ్లు, అడుగు వేయాలంటే విమానాలు.. ఇలా అల్ట్రా మోడ్రన్ లైఫ్‌ను అనుభవించిన ఇంద్రాణి, ప్రస్తుతం జైల్లో మగ్గుతోంది. కన్న కూతురిని హత్య చేసిన కేసు విషయమై ఆమె ముంబై జైల్లో ఉండగా, జైలు అధికారులు సాధారణ ఖైదీగానే చూస్తున్నారు. 
 
ఆమె నిద్రించేందుకు ఒక చాపను మాత్రమే ఇచ్చారు. ఆమె ఉన్న గదిలో ఫ్యాన్ కూడా లేదు. కేవలం ఒక్క కిటికీ మాత్రమే ఉంది. అది కూడా చాలా ఎత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం అల్పాహారంగా వడా పావ్, టీలను ఇస్తున్నారు. ఇంటి నుంచే వచ్చే ఆహారాన్ని ఆమెకు ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరించారు. ఆ ఆహారంలో విషం కలపవచ్చన్న అనుమానాలు తమకున్నాయని వారు స్పష్టం చేశారు.