Widgets Magazine Widgets Magazine

అడవిని ఏలిన వీరప్పన్ ఇలా దొరికాడా? చిరిగిన లాటరీ ముక్కే రహస్యం కక్కిందా?

హైదరాబాద్, శనివారం, 4 ఫిబ్రవరి 2017 (06:24 IST)

Widgets Magazine
veerappan

అడవిదొంగ, కలపదొంగ, ఏనుగుదంతాల దొంగ, ఎర్రచందనం స్మగ్లర్, ఇండియన్ రాబిన్‌హుడ్. ఒక వ్యక్తి పేరుకు ఇన్ని విశేషణాలు తోడయితే ఎవరై ఉంటారు. తప్పకుండా వీరప్పనే అయి ఉంటాడు. దక్షిణ భారత అడవుల్లో పాతికేళ్లుగా స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించుకుని చిక్కడు దొరకడులాగా మూడు రాష్ట్రాల పోలీసుల బలగాల ముప్పేట దాడులనుంచి తప్పించుకుని అడవి రారాజుగా పేరు గాంచిన వీరప్పన్. చివరకు అడవినుంచి బయటకు వస్తున్న క్రమంలోనే పోలీసుల ఎత్తుకు దొరికిపోయాడు.  కానీ తన నీడను కూడా నమ్మని దిట్టగా పేరుపడిన వీరప్పన్‌ ఎలా దొరికాడు? గత 13 ఏళ్లుగా ఇది చిక్కుముడిగానే ఉండిపోయింది. వీరప్పన్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమారే ఆ చిక్కుముడిని విప్పుతున్నారు. వీరప్పన్‌ని మట్టుబెట్టిన నాటి తన అనుభవాలను ఇప్పుడు పుస్తకంలో పొందుపరుస్తున్నారు. ఆ పుస్తకంలోని కొంత సమాచారం లీక్ అయింది. వీరప్పన్ ఎలా దొరికాడు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. అతడిని హతమార్చడంలో చెన్నయ్‌కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రముఖ పాత్ర వహించినట్లు వెల్లడైంది. మాజీ ఐపీఎస్ విజయకుమార్ వీరప్పన్ కోసం సాగించిన వేట, పన్నిన వ్యూహంలో చరమాకం వివరాలు ఇవీ.
 
చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్‌తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముంది. దీంతో ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘాపెట్టారు. వీరప్పన్  వర్గంలోని రహస్య గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటల్‌కు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు పథకం పన్నారు.  చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్‌ చేసిన ఎస్‌ఐ వెల్లదురైని.. వీరప్పన్  వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్‌ నిర్ణయించారు.
 
పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మదురై లేదా తిరుచ్చిలో వీరప్పన్ కు కంటి ఆపరేషన్  చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్  వస్తారన్నాడు
 
లాటరీ ముక్కను నమ్మి.. విజయకుమార్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ వెల్లదురై ఆ రెండో ముక్కను తీసుకుని అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్నాడు. తనవద్దనున్న తొలిసగంతో సరిపోల్చు కున్నాక ఎస్సైని వీరప్పన్  నమ్మకస్తుడిగా భావించాడు. వెల్లదురై చెప్పినట్లుగానే వైద్యం చేయించుకునేందుకు బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్ ను అతని సహచరులను ఎస్‌ఐ వెల్లదురై ఎక్కించాడు. ధర్మపురి వద్ద సిద్ధంగా ఉన్న కమెండో పోలీసులు వీరప్పన్ పై కాల్పులు జరిపి హత మార్చారు. వీరప్పన్ ను హతమార్చేందుకు సహకరించడంతో సదరు పారిశ్రామికవేత్తపై కేసులు పెట్టలేదు. ఆ  వ్యాపారి ఎవరనేది కుమార్‌ బైటపెట్టలేదు.
 
వీరప్పన్ కోసం సాగించిన వేటలో ఒక తీగె చెన్నయ్ పారిశ్రామికవేత్త వద్ద దొరికింది. దాన్ని పట్టుకు లాగితే డొంకంతా కదిలింది. మాయలపకీరు ప్రాణం మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్లుగా వీరప్పన్ ప్రాణానికి గండం ధర్మపురి టీ దుకాణంలో ఏర్పడింది. వైద్యం కోసం తప్పనిసరి స్థితిలో అడవినుంచి బయటకు రావలసిన అవసరం వీరప్పన్ ప్రాణాలకు ఎసరు తెచ్చింది. పాతికేల్ల అడవి రారాజు ప్రాణం సగం చింపిన లాటరీ ముక్కతో పోయింది. ఇంకా అచ్చుకాని విజయకుమార్ పుస్తకం తమిళనాడ సంచలనం కలిగిస్తోంది. 
 Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అతి త్వరలో పవన జగన భేటీ.. కుదిరితే లోటస్‌పాండ్‌లో ఫిబ్రవరి 8నే చర్చలు... నిజమేనా?

జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్, వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ ...

news

వంగి నమస్కరించడం, మోర విరుచుకుని గద్దించడం చెబితే వచ్చేవి కావట..నిజమేనా!

జనంతో కలిసినప్పుడు ఎలా మెలగాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఎవరో ...

news

నన్ను అవమానిస్తే.. వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లే: శివంగిలా లేచిన పెద్దామె..

కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం చేసుకునేవాళ్లకు తల్లిప్రేమ గురించి ఏం తెలుస్తుందంటూ ఒక ...

news

పైలట్ ఆలిగాడు.. విమానం ఆగిపోయింది... వీవీఐపీల వడిగాపులు

బస్టాండుల్లో సమయానికి బస్సు డ్రైవర్ సీటు వద్దకు రాకపోతే ఫలానా నెంబర్ బస్సు డ్రైవర్ గారు ...