శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (09:03 IST)

విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గింపు... మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్..!

ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పలు హామీలను ఇచ్చారు. ఆయన గెలుపు సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలను 50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే ఈ తగ్గింపు ఛార్జీ నెలకు 400 యూనిట్ల వరకు వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది. దీంతో 90 శాతం ఢిల్లీ వాసులకు ప్రయోజనం చేకూరనుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని కేబినెట్ బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఇది అమలుకానుంది. అలాగే ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతకన్నా ఎక్కువ వాడితే మాత్రం బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు.  
 
ఉచిత నీటి సరఫరా వల్ల 18 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కాగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఉచిత నీటి సరఫరాల వలన రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 1,670 కోట్ల భారం పడుతుందని అధికారుల సమాచారం.