శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (12:55 IST)

హార్దిక్ పటేల్ నాకు సన్నిహితుడు కాదు : ప్రవీణ్ తొగాడియా

పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ నాకు సన్నిహితుడు కాదని వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా స్పష్టంచేశారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుజరాత్‌లో భారీ ఉద్యమానికి హార్దిక్ పటేల్ శ్రీకారం చుట్టిన విషయంతెల్సిందే.
 
ఈ ఉద్యమం చేపట్టిన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హార్దిక్ పటేల్ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ఈ వివాదాలపై అతడితో పాటు అతడికి సంబంధం లేని వారు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితే ప్రవీణ్ భాయ్ తొగాడియాకు ఎదురైంది. గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్ భాయ్ తొగాడియాకు హార్దిక్ పటేల్ అత్యంత సన్నిహతుడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ప్రవీణ్ భాయ్ తొగాడియా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ‘‘ప్రతి రోజు నన్ను ఎంతో మంది కలుస్తారు. నాతో ఫొటోలు దిగుతారు. ఆ ఫొటోలకు తప్పుడు అభిప్రాయాలు సృష్టించేలా వాటిని సోషల్ మీడియాలో వాడుకోవడం సరికాదు’’ అని ప్రవీణ్ భాయ్ తొగాడియా వ్యాఖ్యానించారు.