శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2016 (10:56 IST)

అమీర్ ఖాన్.. భారత దేశ గొప్పతనాన్ని ముందు నీ భార్యకు వివరించు!

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ భారత దేశానికి ఉన్న విశిష్టత గొప్పతనం గురించి ముందు ఆయన భార్యకు వివరించాలని బీజేపీ నేత రామ్ మాధవ్ సూచించారు. అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో దేశ విశిష్టత గురించి ముందు ఆయన తన భార్యకు చెప్పాలని, బయట ఆటోరిక్షా నడిపేవారికి చెబితే సరిపోదు..' అని వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో ఎవరూ కూడా తమ అవార్డులను తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని, దేశాన్ని గౌరవిస్తూ, దేశ ప్రతిష్టను గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
 
కాగా ''ఇన్‌క్రెడిబుల్ ఇండియా''  ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమీర్ ఖాన్ గౌరవిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పదేళ్లపాటు ''ఇన్‌క్రెడిబుల్ ఇండియా''కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. తాను ఉన్నా లేకపోయినా భారత్‌ ఉజ్వలమే(ఇన్‌క్రెడిబుల్ ఇండియానే) అని అన్నారు.