బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:09 IST)

రాంపాల్ ఆశ్రమంలో ప్రెగ్నెన్సీ కిట్లు లభ్యం...

హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ ఆశ్రమం మీద పోలీసులు దాడిచేసి, ఆయన్ను అరెస్టు చేశారు. ఆ సమయంలో పోలీసులకు అక్కడ అనేక వస్తువులు లభ్యమయ్యాయి. వాటిలో రివాల్వర్లు, మిరపకాయ బాంబులు.. వంటివాటితోపాటు పెద్ద సంఖ్యలో ప్రెగ్నెన్సీ కిట్లు లభ్యమయ్యాయి. 
 
అంతేకాకుండా రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలానికి కింద సొరంగం లాంటి గది ఒకటుంది. ఇంకా మూడు 32-బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్గన్లు, రెండు, 12 బోర్ రైఫిళ్లు, రెండు 315-బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు కూడా ఆశ్రమంలో ఉన్నాయి. భారీమొత్తంలో ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా కనిపించాయి. రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఆశ్రమ ప్రాంగణంలో కనిపించాయి. 
 
కాగా ఈ విషయంగా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెళ్లడించారు. వాళ్లలో ఎవరైనా నక్సలైట్లు కానీ, నక్సలైట్లతో సంబంధాలు ఉన్నవారు కూడా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.