గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:57 IST)

గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన దళిత గర్భిణీపై అగ్రకులస్తుల దాడి...

గుజరాత్ రాష్ట్రంలో మరోమారు అగ్రకుల దురాహంకారం బయటపడింది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తొలగించేందుకురాని దళిత దంపతులపై అగ్రకులస్తులు దాడిచేశారు. ఈ దాడిలో నిండు గర్భిణి తీవ్రంగా గాయపడింది. తాజాగా

గుజరాత్ రాష్ట్రంలో మరోమారు అగ్రకుల దురాహంకారం బయటపడింది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తొలగించేందుకురాని దళిత దంపతులపై అగ్రకులస్తులు దాడిచేశారు. ఈ దాడిలో నిండు గర్భిణి తీవ్రంగా గాయపడింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లాలోని అమిర్‌గఢ్ తాలుగా కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా (25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరిద్దరు దళిత కులానికి చెందినవారు. 
 
అయితే, ఇదే గ్రామంలో దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తుల పొలంలో గోవు చనిపోయింది. ఆ కళేబరాన్ని తొలగించేందుకు రావాలని దళిత దంపతులను అగ్రకులస్తులు కోరారు. ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని, అందువల్ల కళేబరాన్ని తొలగించలేమని బదులిచ్చారు. 
 
తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది నీలేశ్‌పై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుకోబోయింది. దీంతో ఆమెతో పాటు.. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైన కూడా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు కేసులు నమోదుచేసి దాడికి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు.