గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (18:24 IST)

చదువుకునే రోజుల్లో నేను చిలిపి పిల్లోడిని : బడిపంతులుగా మారిన ప్రణబ్ ముఖర్జీ

దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బడిపంతులుగా మారిపోయారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లో ఆయన ఉపాధ్యాయుడి అవతారమెత్తి విద్యార్థులకు భారతీయ రాజకీయ చరిత్రపై పాఠాలను బోధించారు. ఆ సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో తాను చిలిపి పిల్లోడిని (నాటీ బాయ్) అంటూ చెప్పుకొచ్చారు.
 
 
గురుపూజోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా తరగతి గతిలో మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చాలా చిలిపి వాడినని, తన చేత అమ్మ బలవంతంగా పనిచేయించేదని చెబుతూ, ఆనాటి రోజులను రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. 
 
తాను చదువుకున్న రోజుల్లో కిరోసిన్‌తో వెలిగే దీపాలు మాత్రమే ఉండేవని, తాను వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన యావరేజ్ స్టూడెంట్‌ను మాత్రమేనని ప్రణబ్ వివరించారు. నిత్యమూ పాఠశాలకు వెళ్లేందుకు 5 కి.మీ నడిచేవాడినని చెప్పుకొచ్చారు.