శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:41 IST)

శశికళకు మరో ఎదురుదెబ్బ... పన్నీర్‌కు జై కొట్టిన ప్రిసీడియం ఛైర్మన్.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ప్రిసీడియం ఛైర్మన్ ఇ. మధుసూదనన్‌ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జైకొట్టారు. దీంతో శశికళ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ప్రిసీడియం ఛైర్మన్ ఇ. మధుసూదనన్‌ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు జైకొట్టారు. దీంతో శశికళ షాక్‌కు గురయ్యారు. పైగా, పన్నీర్ సెల్వంవైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 
 
ఇదిలావుండగా, శశికళ వర్గం దాచివుంచిన ఎమ్మెల్యేలందరినీ బయటకు తీసుకుని రావాలంటూ ఆపద్ధర్మ సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో తమిళనాడు డీజీపీ కదిలారు. ఎమ్మెల్యేలు ఏఏ స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో ఉన్నారో తెలుసుకోవాలని పోలీసులకు చెప్పారు. వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలు శశికళ వర్గానికి షాక్‌ను కలిగించేవేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
కాగా, ఎమ్మెల్యేల్లో 20 మంది వరకూ మహాబలిపురంలోని ఓ స్టార్ రిసార్టులో ఉన్నారన్న సమాచారం మినహా, మిగతావాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంకా రహస్యంగానే ఉంది. వారందరినీ కనుగొని బయటకు తెచ్చేందుకు డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగినట్లయింది.