Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెసార్ట్‌లో ఎమ్మెల్యేల మస్తు మజా.. చిన్నమ్మ బిల్లు కట్టి జైలుకెళ్లారా? లేకుంటే పన్నీర్ కట్టాలా? (ఫోటోలు)

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:54 IST)

Widgets Magazine

తమిళ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభంతో శశికళ వెంట నిలిచిన ఎమ్మెల్యేలు మస్తు మజా చేశారు. ఫూటుగా మందు కొట్టిన.. నచ్చిన వెరైటీ వంటకాలు లాగించేశారు. అంతటితో ఆగకుండా మసాజ్‌లు, బోటింగ్ అంటూ ఎంజాయ్ చేశారు. కానీ పైకి మాత్రం మద్యం సేవించలేదని చెప్తున్నారు.

తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సుప్రీం కోర్టు తీర్పుతో ఊచలు లెక్కబెట్టేందుకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో రిసార్ట్స్ రాజకీయాలకు తెరపడినట్లే. ఇక గవర్నర్ బలపరీక్ష పెడితే సంక్షోభానికి కూడా స్క్రీన్ పడినట్టే. కానీ ఆరు రోజుల పాటు గోల్డెన్‌ బే బీచ్‌ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 200 మంది బసచేశారు. నేతలు ఎక్కడకి పోకుండా 200 మందికి పైగా బౌన్సర్లను మొహరించినట్టు సమాచారం.
 
చిన్నమ్మ జైలుకెళ్లిన తరుణంలో ఎమ్మెల్యేలంతా స్టే చేసినందుకు బిల్లు ఎవరు కట్టారనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల మజా కోసం ఇప్పటిదాకా దాదాపు అరకోటి పైనే అయ్యిందట. గోల్డెన్ బే రిసార్ట్‌లో మూడు రకాలుగా గదులు మొత్తం 60కి పైగానే వున్నాయి.

రోజుకు నార్మల్ గది అయితే రూ. 5,500, అదే బే వ్యూ రూమ్- రూ. 6,600 చొప్పున, పారడైజ్ సూట్‌లు - రూ. 9,900 చొప్పున అద్దెలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. అలాగే ఆహారం, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు ప్రత్యేక బిల్లు. మరి ఈ బిల్లును ఎవరు పే చేస్తారు. పన్నీర్ సెల్వం పార్టీ ఫండ్స్‌కి కోశాధికారిగా బ్రేక్ వేసిన తరుణంలో చిన్నమ్మే బిల్లు కట్టి జైలుకు వెళ్ళారా? లేకుంటే ప్రభుత్వం ఈ బిల్లు సంగతి చూడాలా? అనేది ఇంకా తెలియరాలేదు. 
  
ఇక శశకళ జైలుకు వెళ్లడంతో ఎమ్మెల్యేలను రిసార్ట్స్ నుంచి ఖాళీ చేయాల్సిందిగా నిర్వాహకులు సూచించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అంతేగాకుండా.. శశికళ- పళనిస్వామి కలిసి తనను కిడ్నాప్ చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 500 మంది పోలీసులు తనిఖీలు చేశారు. అలాగే ఎమ్మెల్యేల నిర్బంధంపై పోలీసులు ఆరా తీశారు.
 
ఈ క్రమంలో పోలీసులు- ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. నేతలు రిసార్ట్స్ ఖాళీ చేసి తమతమ ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. మంగళవారం వరకు శశికళ వర్గంలోవున్న శరవణన్, రిసార్ట్ నుంచి తప్పించుకుని వచ్చి తనను శశికళ గ్రూప్ కిడ్నాప్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంచీపురం ఎస్పీతో పాటు రిసార్టులోనికి వెళ్లిన 50 మంది పోలీసులు.. ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తున్నారు. రిసార్టు పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mlas Bill Sasikala Paneerselvam Tamil Nadu Golden Bay Resort

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళను పంపిన స్వామి... టార్గెట్ స్టాలిన్, దయానిధి, కళానిధిలను కూడా...

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు ...

news

అన్నాడీఎంకేలో చీలిక.. డీఎంకే వ్యూహం.. త్వరలో ఎన్నికలు వస్తాయ్: స్టాలిన్ జోస్యం

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ప్రస్తుత డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ...

news

Mannargudi Mafia is Back... ఎమ్మెల్యేలను వదలం... తమిళనాడు డీజీపికే సవాల్?

అమ్మ సమాధి వద్ద ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లతో భగభగ చూస్తూ సమాధిపై సత్తవకొద్దీ ...

news

పళని వద్దు.. పన్నీరే ముద్దు.. చిన్నమ్మకు జైలులో కంపెనీ ఇస్తున్న పళని బంధువు..?

తమిళనాడు సీఎం అభ్యర్థిగా శశికళ వర్గంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి బంధువులు తక్కువేం తినలేదు. ...

Widgets Magazine