శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 21 జులై 2014 (18:51 IST)

ప్రధాని విమానంలోని వ్యవస్థ క్షిపణిని సైతం బురిడీ కొట్టిస్తుంది!

ఇటీవల మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 17ను ఉగ్రవాదులు బుక్ అనే క్షిపణి ప్రయోగంతో కూల్చిన విషయం తెలిసిందే. అదేదారిలో ప్రయాణించాల్సిన భారత ప్రధాని విమానాన్ని దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో మన ప్రధాని విమానం అత్యంత సురక్షితమని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. 
 
మోడీ ప్రయాణిస్తున్న ఎయిరిండియా వన్‌ విమానం.. ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రమాదానికి గురైన మలేషియా విమానం ఎంహెచ్‌-17 ప్రయాణించిన మార్గంలోనే ప్రయాణించిందని అధికారులు చెబుతున్న విషయం తెల్సిందే. అయితే ప్రమాదవంతమైన ఆప్రాంతంలో ప్రయాణిస్తున్న ప్రధాని విమానం పైకి క్షిపణులు ప్రయోగించినా ప్రమాదం లేదా? అంటే అధికారులు అవుననే అంటున్నారు. 
 
2009లో ప్రధాని, వీవీఐపీల ప్రయాణం కోసం భారత వైమానిక దళం రూ.936.93 కోట్లు వెచ్చించి 46 సీట్ల సామర్థ్యం ఉన్న మూడు బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ (బీబీజే)లను కొనుగోలు చేసింది. వాటిలో మరో 200 కోట్లు వెచ్చించి క్షిపణి దాడులను పసిగట్టి దాడుల నుంచి రక్షించే ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజరర్స్‌ (ఈసీఎమ్‌) వ్యవస్థను ఏర్పాటు చేసింది. 
 
క్షిపణి ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించిన వెంటనే కాక్‌పిట్‌లోని రాడార్‌ వ్యవస్థ దానిని పసిగట్టిన వెంటనే ఈసీఎమ్‌.. క్షిపణిని తప్పుదారి పట్టించేలా సంకేతాలను విడుదల చేస్తుందట. దేశ ప్రధాని విమానం పైకి వదిలిన క్షిపణి సైతం ఈసీఎమ్‌తో చిన్నబోవాల్సిందేనట. 
 
ఈసీఎస్ వ్యవస్థను రూ.200 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించగానే... విమానంలోని రాడార్ దాన్ని పసిగడుతుంది. వెంటనే క్షిపణిని తప్పుదారి పట్టించే సంకేతాలను విడుదల చేస్తుంది. దీంతో, ఎలాంటి క్షిపణి అయినా ఈ విమానాన్ని ఢీకొనలేక పక్కదారి పడుతుంది. 
 
కాగా, 2009లో ప్రధాని, వీవీఐపీల ప్రయాణం కోసం భారత వైమానిక దళం రూ.936.93 కోట్లు వెచ్చించి 46 సీట్ల సామర్థ్యమున్న మూడు బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ (బీబీజే)లను కొనుగోలు చేసింది. వాటిలో మరో 200 కోట్లు వెచ్చించి క్షిపణి దాడులను పసిగట్టి దాడుల నుంచి రక్షించే ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌మెజరర్స్‌ (ఈసీఎమ్‌) వ్యవస్థను ఏర్పాటు చేసింది. క్షిపణి ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించిన వెంటనే కాక్‌పిట్‌లోని రాడార్‌ వ్యవస్థ దానిని పసిగట్టిన వెంటనే ఈసీఎమ్‌.. క్షిపణిని తప్పుదారి పట్టించేలా సంకేతాలను విడుదల చేస్తుంది! దేశ ప్రధాని విమానంపైకి వదిలిన క్షిపణి సైతం ఈసీఎమ్‌తో చిన్నబోవాల్సిందే మరి!