శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 29 జులై 2017 (12:25 IST)

నరేంద్ర మోడీ సామాన్యుడు కాదు.. ఎలా..?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో నరేంద్రమోడీ పావులు కదుపుతున్నారు. భారతీయ జనతాపార్టీ లేకున్నా తమ కనుసన్నల్లోనే పార్టీని నడిపించుకోవాలన్నది మోడీ భావన.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో నరేంద్రమోడీ పావులు కదుపుతున్నారు. భారతీయ జనతాపార్టీ లేకున్నా తమ కనుసన్నల్లోనే పార్టీని నడిపించుకోవాలన్నది మోడీ భావన. అందుకే ఎక్కడ అవకాశం దొరికినా వెంటనే తలదూర్చి బీజేపీ కనుసన్నల్లోనే పార్టీని నడిపే విధంగా చేసేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. తాజాగా బీహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నరేంద్రమోడీకి బాగా కలిసొచ్చింది. తన కేబినెట్లో అవినీతి, ఆరోపణలు ఉన్న వ్యక్తి ఉండకూడదని, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ వెంటనే ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్.
 
అయితే తేజస్వీ యాదవ్ అస్సలు రాజీనామా చేయనని తెగేసి చెప్పారు. దీంతో నితీష్ తన పదవికి రాజీనామా చేసేశారు. ఇక వెంటనే నితీష్‌తో సంప్రదింపులు జరిపిన మోడీ అండగా నిలిచాడు. మరుసటి రోజు ఉదయం కల్లా ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమార్‌నే కూర్చోబెట్టాడు. దీంతో లాలూప్రసాద్ యాదవ్‌కు పెద్ద దెబ్బే తగిలింది. నితీష్‌, లాలూప్రసాద్ యాదవ్‌లు ఇద్దరూ కలిసే అధికారంలో ఉంటే ఒక్కసారిగా అంతా రివర్సయి పోయింది. 
 
ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసేసుకుంటున్నారు మోడీ. మోడీకి ఎప్పటినుంచో తమిళనాడుపైనే కన్ను ఉంది. తమిళనాడు రాష్ట్రం తన కనుసన్నల్లోనే జరగాలన్నది ఆయన భావన. అందుకే రకరకాల ప్రయత్నం చేశారు. కానీ సాధ్యపడలేదు. కానీ ఇప్పడు మాత్రం ఎలాగైనా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారం ఎవరిదైనా తమ కింద పనిచేయాలన్న ఆలోచనతో మోడీ పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో తామేంటో సత్తా చాటుకున్న బీజేపీ ఉత్తరాదిలో కూడా హవా కొనసాగిస్తుందని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు.