శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (16:52 IST)

జపాన్ టూర్: టోక్యోకు చేరుకున్న నరేంద్ర మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టోక్యో చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్రం జపాన్‌కు బయలుదేరిన మోడీకి టోక్యోలో ఘన స్వాగతం లభించింది. మోడీ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముఖేష్‌ అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ తదితరులు ఉన్నారు.
 
మోడీ జపాన్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా జపాన్‌ పర్యటన ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళతారనే భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఈ పర్యటనలో రక్షణ, పౌర అణు కార్యక్రమం, మౌలిక వసతులు అభివృద్ధి వంటి రంగాల్లో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రక్షణ, పౌర అణు కార్యక్రమాల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
 
ఈ పర్యటనలో మోడీ జపాన్‌లోని స్మార్ట్‌ సిటీ క్యోటో, రాజధాని టోక్యో సందర్శించనున్నారు. టోక్యోలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు లాంఛనాలు పక్కనబెట్టి జపాన్‌ ప్రధాని సింజూ అదే అ నగరానికి చేరుకున్నారు. భారత్‌లో వంద స్మార్ట్‌ సిటీలు నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో మోడీ జపాన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.