Widgets Magazine

అంజయ్యను రాజీవ్ అవమానిస్తే.. చంద్రబాబును మోడీ అవమానించలేదా?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (10:04 IST)

modi - shah

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన దివంగత అంజయ్య, నీలం సంజీవ రెడ్డిలను మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అవమానిస్తే ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానించారు. అపాయింట్మెంట్ కావాలంటూ చంద్రబాబు ఒక యేడాది కాలం మొరపెట్టుకున్నారు. కానీ, ప్రధాని మోడీ ఇవ్వలేదు. ఈ యేడాది కాలంలో వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాత్రం ప్రధానితో మూడుసార్లు భేటీ అయ్యారు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం కాదా. అలాగే, పార్లమెంట్ సాక్షిగా హామీలను ఉల్లంఘించడం రాజ్యాంగాన్నే అవమానించడం కాదా?
 
పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ చేసేందుకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ తలుపులు మూసి మరీ విభజన చట్టం ఆమోదించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఇపుడేదో కొత్తగా కనిపెట్టినట్టు చెపుతున్నారు. ఆ రోజున ఒక తలుపు కాంగ్రెస్‌ మూస్తే మరో తలుపుమూసింది బీజేపీ నేతలు కాదా. అక్కడ బాధ్యత కానట్టు రాజ్యసభలో మాత్రం మంతనాలు జరిపి ప్రత్యేక హోదా పట్టుపట్టింది బీజేపీ నేత, ఇప్పుడు సభాద్యక్షుడు వెంకయ్య నాయుడేనన్న విషయాన్ని మోడీ విస్మరించినట్టున్నారు.
 
విభజన చట్టంలోని రెండు మూడు అంశాలను పునరుద్ఘాటించడంతో పాటు అయిదేళ్ల ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీ, రాజధానికి సహాయం, పోలవరం జాతీయ హోదా, వెనుకబడిన జిల్లాలకు సాయం, బుదేల్‌ఖండ్‌ ప్యాకేజీ అన్న అంశాలను నాటి ప్రధాని రాజ్యసభలో లిఖితపూర్వకంగా ప్రక టించారు. దాన్ని అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఘనంగా వాగ్దానం చేసింది. నమ్మి ఓటేశాక చట్టబద్ధత లేదని ఎగనామం పెట్టింది. పోనీ మీరు చట్టబద్ధత కల్పించివుండొచ్చు కదా నరేంద్ర మోడీ.. ఇది ఇది మోసం చేయడం కాదా అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ Derogation తెలుగుదేశం పార్టీ Insulted Narendra Modi Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

గర్భిణీకి సీటివ్వమంటే.. తోటి ప్రయాణీకులే ఇలా చేశారు..?

బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకుల్లో మానవత్వం కనుమరుగైందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లలతో ...

news

ఆధార్‌ను పుట్టించిందనే మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన ...

news

ట్రైనీ నర్సుకు మత్తు సూది వేసి రేప్ చేసిన వైద్యుడు

తల నొప్పిగా ఉంది .. టాబ్లెట్ రాసివ్వమని వైద్యుడి వద్దకు వెళ్లిన ఓ ట్రైనీ నర్సు ...

news

మిస్టర్ జైట్లీ... మీరూ.. మీ సర్కారు శాశ్వతం కాదు : సుజనా చౌదరి ఫైర్

భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునే దిశగానే అధికార టీడీపీకి చెందిన ఎంపీలు అడుగులు ...

Widgets Magazine