శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (10:10 IST)

ఎనిమిదేళ్ళ వయస్సులోనే వ్యభిచారం.. బాలికలకు నరకం చూపుతున్న కామాంధులు... భారత్‌లోనే

భారత్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కామాంధుల చేతుల్లో పడి నలిగిపోతున్న వారిలో ఆరేళ్ళ బాలిక నుంచి 80 యేళ్ళ ముదుసలి వరకు ఉన్నారు. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఆడపిల్లల అక్రమ రవాణాపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆమె ప్రదర్శించారు. అనంతరం యూఎస్ కాన్సులేట్ ప్రతినిధి మైఖెల్ మిలిన్‌తో కలిసి సునితా కృష్ణన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అక్రమ రవాణా ముఠాలు విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గ్రామీణ ప్రాంతాల వారిని టార్గెట్ చేస్తున్నాయని, ప్రేమ, సినిమా చాన్సులని, పని చూపిస్తామని ఆడపిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారని తెలిపారు.
 
ఇలా 8, 10, 15 ఏళ్ల చిరు ప్రాయాల్లోనే పసిమొగ్గలకు నరకాన్ని చూపిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 30 లక్షల మంది అక్రమ రవాణాకు గురవుతున్నారని, అందులో 45 శాతం ఆడపిల్లలు ఉండటం దురదృష్టకరమన్నారు. ఆడపిల్లలను రక్షించుకోవడమే లక్ష్యంగా ప్రజ్వల స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశామని, యూఎస్ కాన్సులేట్‌తో కలిసి సంయుక్తంగా ఈ రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.