Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశంలోనే ఫస్ట్ టైమ్.. 'ఆ'పరేషన్ సక్సెస్... కుమార్తెకు మాతృత్వపు ఆనందాన్నిచ్చిన తల్లి!

శనివారం, 20 మే 2017 (16:03 IST)

Widgets Magazine
pune hospital

వైద్యశాస్త్రంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు మనదేశ వైద్యులు. దేశంలోనే తొలిసారి గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా మార్పిడి చేశారు. తద్వారా తన కుమార్తెకు మాతృత్వపు ఆనందాన్ని ఇచ్చిందో తల్లి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సోలాపూర్‌కు చెందిన 21 యేళ్ల యువతికి గర్భసంచిలో సమస్య ఏర్పడటంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆమెకు మాతృత్వపు ఆనందాన్ని ప్రసాదించాలని ఆమె తల్లి నిర్ణయించింది. దీంతో తన గర్భసంచిని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. 
 
దీంతో అత్యంత సంక్లిష్టమైన గర్భసంచి మార్పిడి ఆపరేషన్‌ను చేసేందుకు పుణెలోని గెలాక్సీ కేర్‌ లాప్రోస్కోపీ ఇనిస్టిట్యూట్ వైద్యులు ముందుకు వచ్చారు. ఈ ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని గురువారం చేపట్టారు. ఏకధాటిగా 9 గంటల పాటు ఆపరేషన్ చేసి విజయం సాధించారు. ఆపరేషన్ తర్వాత తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
 
గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భందాల్చాలంటే ఏడాదిపాటు వేచి ఉండాలని, అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటు పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు గర్భసంచి మార్పిడి 30 జరగగా, అందులో కొన్ని కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబు వ్యూహాలను పవన్ తట్టుకోగలడా? జనసేన తీరం దాటలేని తుఫానా...?

రాష్ట్ర రాజకీయాలలో జనసేన నేత పవన్‌ కళ్యాణ్ ప్రభావంపై చర్చలు, విశ్లేషణలు జోరుగా ...

news

టెన్త్ పరీక్షలు రాస్తే ఇంటర్‌లో ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత.. హౌ? ఇది మాజీ సీఎంకే చెల్లుతుంది!

సాధారణంగా పదో తరగతి పరీక్షలు రాస్తే పదో తరగతిలోనే ఉత్తీర్ణులవుతారు. కానీ, ఇక్కడ పరిస్థితి ...

news

మోడీని జగన్ కలిస్తే టీడీపీ నేతలకు గుబులెందుకు : వెంకయ్య ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక రాష్ట్రానికి చెందిన విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ...

news

మోదీపై మాటలు తూటాలు పేలుస్తున్న పవన్ కళ్యాణ్... చిరంజీవికి కష్టాలు తప్పవా?

ఎందుకో కానీ రూమర్లు అలా తిరుగుతుంటాయి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ...

Widgets Magazine