శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:09 IST)

యమునా నది తీరంలో పీవీ నరసింహారావు స్మారక చిహ్నం..!

కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు స్మారక చిహ్నం దక్కనుంది. ఆయనకు సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీలో స్మారకాన్ని నిరాకరించగా, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ గౌరవాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమైంది.
 
కాంగ్రెస్ పార్టీలో నెహ్రు కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కాంగ్రెస్ ప్రచార బ్యానర్లు, పోస్టర్లలో అది కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటుంది. అందుకే మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. 
 
కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహరావు ఐదేళ్ళపాటు ప్రభుత్వాన్ని సమర్ధంగా నడపడమే కాకుండా భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి కూడా నిరాకరించింది.
 
కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించకపోయినప్పటికీ, ఎన్డీయే ప్రభుత్వం ఆయనకు దక్కవలసిన గౌరవమర్యాదలు కల్పించేందుకు, యమున నది ఒడ్డున ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ సముదాయంలో పీవీ మెమోరియల్ ఘాట్ ని నిర్మించడానికి మంత్రిమండలి అమోదం కోసం పట్టణాభివృద్ధిమంత్రిత్వశాఖ ఒక ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనకు కేంద్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ చేయలేని ఈ సత్కార్యాన్ని బీజేపీ చేయడం విశేషం.