బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (16:40 IST)

సత్సంఘ్ పూజ రాధే మా నగ్నంగా చేయించింది.. నా బట్టలు విప్పించి నన్ను కూడా నగ్నంగా...

radhe maa
వివాదాస్పద  ఆధ్యాత్మిక దేవత (గాడ్ ఉమెన్) రాధే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్‌ అర్థరాత్రి పురుషులతో నగ్న పూజలు చేస్తున్నట్టు ఆమె శిష్యురాలు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక మహిళా గురువు రాధే మాపై వరకట్న వేధింపులు, హత్యా యత్నం ఆరోపణలతో పాటు పలు విధాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాధే మా పై ఓ మహిళా భక్తులురాలు ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
అందులో ఆమె ఇలా పేర్కొంది. రాధే మా అర్ధరాత్రి సత్సంఘ్ సేవ అనే పేరుతో నగ్న పూజలు నిర్వహించేదని తెలిపారు. ఆ పూజా సమయంలో భక్తులను ఒంటిపై నూలుపోగు లేకుండా చేసి, నగ్నంగా డ్యాన్స్‌ చేయిస్తుందన్నారు. అందులో తనను కూడా నగ్నంగా చేసి డ్యాన్స్ చేయించిందని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ కలర్స్ టీవీ కార్యక్రమం 'బిగ్ బాస్' షోతో ప్రాచుర్యం పొందిన మహిళ డాలీ బృందా.
 
బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన డాలీ బృందా ఆఫ్ షార్ట్స్, టీ షర్ట్ ధరించి ఆ షోలో అందరినీ ఆకట్టుకుంది. ఆమె రాధే మా అమిత భక్తురాలుగా ఉండేది. రాధే మా పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డాలీ బృందా ఆమెపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. రాధే మా అర్ధరాత్రి సత్సంఘ్ కార్యక్రమం జరిపేదని తెలిపింది. ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తనను  కూడా బలవంతపెట్టినట్టు తెలిపారు. అలా వచ్చినట్లైతే తనకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మబలికిందని చెప్పారు.
 
ఈ స్థితిలో తాను అర్ధరాత్రి పూజలకు వెళ్లగా అక్కడ అందరూ నగ్నంగా డ్యాన్స్ చేస్తుండడం చూసి దిగ్భ్రాంతి చెందానని తెలిపింది. ఆ సమయంలో తన చేత కూడా బలవంతంగా బట్టలు ఊడదీయించి, ఇతరులతో లైంగిక సంబంధాన్ని పొందే రీతిలో రెచ్చగొట్టిందన్నారు. అంతేకాకుండా ఆ కార్యక్రమంలో తన భర్తను కూడా బలవంతంగా పాల్గొనేలా చేసిందని ఆమె ఫిర్యాదులో తెలిపింది. 
 
పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని, రాధే మాకు బడా బాబుల సహాయ సహకారాలు ఉన్నాయంటూ డాలీ బృందా పోలీసు స్టేషన్‌లో వెల్లడించింది.