బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (10:35 IST)

యూరప్‌లో రాహుల్ యోగా... బీజేపీ ఆగ్రహం..!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవు పెట్టి ఎక్కడికెళ్లారనే విషయం పెద్ద చర్చకు దారితీసింది. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏమాత్రం బాధ్యత లేకుండా ఏ విదేశానికో పర్యటనకెళ్లారని రాహుల్ పై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంపై పెదవి విప్పిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాహుల్ గాంధీ సెలవు తీసుకున్న మాట వాస్తవమేనని తెలిపాయి. అయితే ఆయన ఎక్కడికెల్లారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. 
 
తాజాగా రాహుల్ గాంధీ విదేశాలకెళ్లిన మాట నిజమేనని, ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. విపాసన యోగ చేసేందుకే రాహుల్ యూరప్ వెళ్లారని కూడా సదరు నేత తెలిపారు. మార్చి తొమ్మిదో తేదిన రాహుల్ గాంధీ యూరప్ నుంచి తిరిగి వస్తారని ఆయన చెబుతున్నారు. కాగా ఇదివరకు రాహుల్‌గాంధీ ఉత్తరాఖండ్‌లో ఓ ప్రాంతంలో సేదదీరుతున్నారని పార్టీ నేత ఒకరు ప్రకటించిన సంగతి తెలిసిందే.