Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టపాసుల మోత మోగుతుందనుకుంటే.. తడిసిన తారాజువ్వలా తుస్సుమంది: రాహుల్

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:55 IST)

Widgets Magazine
rahul gandhi

కేంద్ర బడ్జెట్ 2017పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్‌లో తాము మెరుపుల కోసం ఎదురుచూస్తే.. అలాంటివేమీ లేకుండా ప్రసంగం చాలా చప్పగా ముగిసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యువతకోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఏమీ చేయలేదని రాహుల్ తెలిపారు.
 
రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించేందుకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతిస్తామన్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2017-18 సార్వత్రిక బడ్జెట్‌ తీవ్రంగా నిరాశపర్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బడ్జెట్ వల్ల రైతులకు, యువతకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. 
 
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం అనంతరం రాహుల్ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ... ''మేము టపాసుల మోత మోగుతుందని ఆశించాం. తీరా చూస్తే బడ్జెట్ 2017-18 తడిసిపోయిన తారాజువ్వలా తుస్సుమంది'' అని ఎద్దేవా చేశారు.  
 
ఇదిలా ఉంటే.. ఇకపై దేశ ఆర్థికవ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని ప్రధాని మోదీ అన్నారు. చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీకి అభినందనలు తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం ద్వారా మొత్తంగా రవాణా వ్యవస్థను ఒకే గొడుగుకిందకు తెచ్చామని మోదీ పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో భద్రత నిధి కీలకమన్నారు. నల్లధనం నియంత్రణకు కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు.
 
బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు. బడ్జెట్‌లో అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశామన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జైట్లీ నోట గాంధీ మాట.. నిర్ణయం సరైనదైతే.. అది ఎన్నటికీ విఫలం కాదు.. బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ...

news

పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయ్.. తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ...

news

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదు.. సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడు : ఇన్ఫోసిస్‌ టెక్కీ తండ్రి రాజు

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చక పోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు ...

news

'నువ్వు పాలిచ్చే తల్లివేనా.. జాకెట్ విప్పు... చనుబాలు పితికి చూపించు'.. భారత సంతతి మహిళకు అవమానం

బెర్లిన్ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిళకు ఘోర అవమానం జరిగింది. ‘‘నువ్వు పాలిచ్చే తల్లివేనా? ...

Widgets Magazine