శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (16:20 IST)

రాహుల్ పౌరసత్వంపై తాము తిరుగుతూ విచారణ జరపాలా?.. సుప్రీంకోర్టు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వంపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈ వ్యవహారంలో తాము తిరుగుతూ విచారణ జరపాలా? అని పిటిషనర్‌ను కోర్టు నిలదీసింది. ఇది చాలా అల్పమైన వ్యాజ్యం అంటూ కొట్టేసింది. 
 
రాహుల్‌కు బ్రిటన్‌ పౌరసత్వం ఉందని గతంలో పేర్కొన్నట్లు భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలు వివాదంరేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఓ పిటిషన్‌ దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 
 
రాహుల్ బ్రిటన్ పౌరసత్వంపై పిల్‌తో పాటు జతచేసిన పత్రం ప్రామాణికతను ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌కు ఏమాత్రం విలువలేదని స్పష్టంచేసింది. గతంలో కూడా ఈ వివాదంపై న్యాయవాది ఎంఎల్‌ శర్మ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్‌కు ఊరట లభించినట్టయింది.