గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (17:07 IST)

కాలేజీ కుర్రోడిలా రాహుల్ గాంధీ.. టీషర్ట్.. జీన్స్ ఫ్యాంటుతో...

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరికొత్త వేషధారణలో దర్శనమిచ్చారు. టీ షర్ట్, జీన్స్ ఫ్యాంట్ ధరించి.. షేవ్ చేసి.. అచ్చం.. కాలేజీ కుర్రాడిలా కనిపించాడు. ఈ 44 యేళ్ళ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ శుక్రవారం పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
 
 
ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నకు ఆయన ఓపిగ్గా.. సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నింటికీ ఊ కొడితే ఓకే, లేదా మిమ్మల్ని జాతివ్యతిరేకి అన్న ముద్రవేస్తారు' అని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. 
 
తమ ఇనిస్టిట్యూట్ ఛైర్మెన్‌గా టీవీ నటుడు రాజేంద్ర సింగ్‌ని నియమించిననాటి నుంచి విద్యార్ధులు చేస్తున్న ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ.. ఇక్కడే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక విద్యా సంస్థల్లో పరిస్థితి దీనంగా ఉంది, పట్టించుకునేవాడే లేకుండా పోయాడు అని విమర్శించారు.