శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (20:24 IST)

రఫ్ రాహూల్ : నానమ్మ బాటలో నడిచి కేదార్ నాథ్ కు..

విశ్రాంతి తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మాట తీరులో మార్పు వ్యవహారశైలిలో మార్పు కనిపిస్తోంది. దీనికి కారణమేంటో తెలియదు సున్నితంగా కనిపించే రాహూల్ రఫ్ రాహూల్ గా మారుతున్నారు. ఆయన 17 కిలోమీటర్లు కాలినడకకు బయలుదేరాడు. అదేదో ప్రజా యాత్రో, పాదయాత్రో ఎంత మాత్రం కాదు. కాలినడకన వెళ్ళి కేదారినాథుని ఆశీర్వాదం పొందాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడో తన నాయనమ్మ 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బద్రీనాథుని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆమెనే ఆదర్శంగా తీసుకుని రాహూల్ శుక్రవారం నడక దారిని వెళ్ళి కేదార్ నాథ్ ను దర్శించుకోనున్నారు. 
 
చాలా రోజుల విరామం తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ వారం రోజులుగా పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో ధీటుగా స్పందిస్తూ తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేదార్ నాథ్ ఆలయానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాప్టర్ పంపుతానన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విన్నపాన్ని కూడా తిరస్కరించారు. గౌరికుంద్ నుంచి కేదార్ నాథ్ వరకు ఆయన మొత్తం 17 కిలో మీటర్లు నడిచి వెళ్తారని చెప్పారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కాలినడకన ఆలయాన్ని చేరుకొని రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటికే రాహుల్ మరికొందరు నేతలతో కలసి కేదార్ నాథ్ బయలు దేరారు.
 
ఈ నేపథ్యంలోనే ఆయన కేదార్ నాథ్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. దీనిపైనే హరీశ్ రావత్ మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్ను దర్శించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇందిరతో ఉన్నానని, ఇప్పుడు రాహుల్తోనని నాడు ఇందిరా బద్రీనాథ్ బాబా దీవెనలు పొందితే ఇపుడు రాహుల్ కేదార్ బాబా దీవెనలు పొందనున్నారని చెప్పారు.