మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:45 IST)

సోనియా గాంధీ రాహుల్‌ను పక్కన బెట్టి.. సీనియర్లను నెత్తిన పెట్టుకునేది!

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యవంతం చేసేలా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అడ్డుకునేవారని, పలు విషయాల్లో వీరిద్దరూ ఒకే మాటపై నిలిచేవారు కాదని డిగ్గీ వ్యాఖ్యానించారు.
 
రాహుల్, సోనియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, తరాల అంతరం కారణంగా ఒకే నిర్ణయం తీసుకోలేక పోయేవారని, చాలాసార్లు కొడుకును పక్కనబెట్టి, సీనియర్ల సలహాల అమలుకే సోనియా మొగ్గు చూపేవారని వివరించారు.
 
స్థానిక ఎన్నికలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల నియామకాల్లో కింది స్థాయి కార్యకర్తలను ప్రోత్సహిస్తే, తాము అనుభవిస్తున్న హోదాలు కోల్పోతామని కొందరు నేతలు భావిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. రాహుల్ దీనిపై దృష్టిని సారించి కష్టపడే కార్యకర్తలకు మంచి పదవులు ఇవ్వాలని భావించేవారని, కానీ ఢిల్లీలో ఉండే బలమైన నేతలు ఆయన ఆలోచనలకు బ్రేకులు వేసేవారని తెలిపారు.