శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:21 IST)

ఢిల్లీ-కోల్‌ కతా, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణం ఒక్క రాత్రే!

ఢిల్లీ-కోల్ కతా, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణం ఒక్క రాత్రిలో పూర్తికానుంది. ఎలాగంటే మెట్రో రైలు వేగం పెంచితే నగరాల మధ్య ప్రయాణం సులువు కానుంది. దేశంలోని మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంచుతున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగం పెంచుతున్నట్టు చెప్పారు. 
 
ప్రయాణ సమయంలో తగ్గించేందుకు తొమ్మింది రైల్వే కారిడార్లలో మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంచుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం గంటలకు 110 కిలోమీటర్ల ఉన్న చోట 160 కిలోమీటర్లకు, 130 నుంచి 200 కి.మీల వరకు పెంచినట్టు వివరించారు. దాంతో ఢిల్లీ-కోల్ కతా, ఢిల్లీ-ముంబయిల మధ్య ప్రయాణం ఒక్క రాత్రిలో పూర్తవుతుందని సురేశ్ ప్రభు పేర్కొన్నారు.