గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:43 IST)

రైల్వే బడ్జెట్ సూపర్ అంటూ నరేంద్ర మోడీ ట్వీట్.. పవన్ పెదవి విరుపు!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్‌లో కొత్తగా ఏదీ కనిపించలేదని మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ అన్నారు. గతంలో బడ్జెట్లకు ఇది కేవలం పొడిగింపుగా ఉందన్నారు.
 
పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన సురేష్ ప్రభు ఈసారి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు లేవు. కొత్త రైళ్లు లేవు. దీని పైన విపక్షాలు ప్రశ్నించాయి. కొత్త రైళ్ల పైన ప్రకటన చేయకుండానే ఆయన ప్రసంగం ముగించారు. దీనిపై వివరణ ఇస్తూ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేస్తామన్నారు.
 
అయితే రైల్వే బడ్జెట్‌ ముందు చూపుతో, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రయాణీకుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. మొదటిసారి టెక్నాలజీ, అప్ గ్రెడేషన్, రైల్వేల ఆధునికీకరణకు పెద్దపీట వేసినట్లు మోడీ పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.