గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (03:43 IST)

మంచి భోజనం అందించడమే కాదు.. సినిమాలు కూడా చూపిస్తారట.. వామ్మో.. మన రైళ్లకు ఏమైంది..

ప్రయాణీకుల సౌకర్యానికి నూటికి నూరు శాతం హామీపడతామని చెబుతున్న రైల్వే వ్యవస్థ ఇప్పటికే రైలు ప్రయాణీకులకు బయటి ఫుడ్ కూడా ఆర్డర్ మేరకు తెప్పించి అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది ఏమేరకు నెరవేరిందో చెప్పలేం కానీ తాజాగా రైల్లో ప్ర

అద్వాన్నపు సౌకర్యాలకు మారుపేరుగా నిలిచిన ఇండియన్ రైల్వేస్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇది సాధ్యమా అని సందేహాలు వస్తున్న సందర్భంలో ప్రయాణీకుల సౌకర్యానికి నూటికి నూరు శాతం హామీపడతామని చెబుతున్న రైల్వే వ్యవస్థ ఇప్పటికే రైలు ప్రయాణీకులకు బయటి ఫుడ్ కూడా ఆర్డర్ మేరకు తెప్పించి అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇది ఏమేరకు నెరవేరిందో చెప్పలేం కానీ తాజాగా రైల్లో ప్రయాణిస్తూ కూడా టీవీసీరియల్స్, సినిమాలు చూపిస్తామని ప్రకటించింది. వీటిని కాస్త రుసుముతో అందిస్తానని, అదే రేడియో అయితే ఫ్రీ అని రైల్వే శాఖ ప్రయాణీకులను ఊరిస్తోంది. 
 
ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసుతో పాటు రేడియో సర్వీసును తీసుకురానుంది. కంటెంట్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసును పొందేందుకు ప్రయాణికులు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే శాఖ తాజా ప్రకటన ప్రకారం, ప్రీమియర్‌ రైళ్లలో ప్రయాణించే వారు త్వరలోనే తమ ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లలో టీవీ సీరియల్స్, సినిమాలు చూసే అవకాశం లభించనుంది.
 
అయితే రేడియో సర్వీసును మాత్రం ఉచితంగా అందించనున్నాట్లు అధికారులు చెప్పారు. మొదటగా రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్‌ రైళ్లలో ఈ సర్వీసును ప్రవేశపెడతారు. ప్రయాణీకుల స్పందనను బట్టి తదుపరి దశలో ఇతర రైళ్లలోనూ ఈ సౌకర్యాన్ని అందిస్తారట.