మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (09:01 IST)

గుజరాత్ ట్రయల్... రాజస్థాన్ ఇంటర్వెల్... బీజేపీపై శివసేన ఎంపీ సెటైర్లు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఫలితంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ట్రయల్ కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎ

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఫలితంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ట్రయల్ కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఇంటర్వెల్‌, పూర్తి బొమ్మ 2019లో కనిపిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారనీ, ఆ కారణంగానే తాము పొత్తుకు స్వస్తి చెప్పినట్టు ఆయన వెల్లడించారు. 
 
ఇకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రాజస్థాన్ బీజేపీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు లోక్‌సభ, ఒక శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం చవిచూసిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరరాజెపై అసమ్మతి తీవ్రమవుతోంది. ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. 
 
పదవి నుంచి ఆమెను తప్పించాలని కొందరు అసమ్మతి బీజేపీ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు లేఖ రాశారు. ఆమె వల్లే ఉప ఎన్నికల్లో ఓడిపోయామని, సీఎంగా కొనసాగితే ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం ఖాయమని పేర్కొన్నారు. అయితే ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి మేలుకొలుపని, చేసిన అభివృద్ధి పనులను పార్టీ పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.