గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 15 జూన్ 2017 (01:51 IST)

చేసేది పోలీసు ఉద్యోగం.. అరెస్టైన భర్తను విడిపించాలంటే పక్కలోకి రమ్మన్నాడు

ఇది రాజస్థాన్‌లో మరో కామ పోలీసు మద ప్రకోప గాథ. తన భర్తను మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు చేశారని, దయచేసి అతడికి బెయిలు ఇప్పించాలని ఒక మహిళ పోలీసు స్టేషన్ కొచ్చి ఎస్ఐ కాళ్లా వేళ్లా పడింది. తాను విడిపించగలను కానీ అందుకు ఒక్కసారి తన పక్కలోకి రా

ఇది రాజస్థాన్‌లో మరో కామ పోలీసు మద ప్రకోప గాథ. తన భర్తను మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు చేశారని, దయచేసి అతడికి బెయిలు ఇప్పించాలని ఒక మహిళ పోలీసు స్టేషన్ కొచ్చి ఎస్ఐ కాళ్లా వేళ్లా పడింది. తాను విడిపించగలను కానీ అందుకు ఒక్కసారి తన పక్కలోకి రావాల్సి ఉంటుందని ఆఫర్ చేసాడా ప్రబుద్ధ పోలీసు. చివరకు ఆమె ఏసీబీ ఆధికారులను ఆశ్రయించింది. ఆ పోలీసు ఆమె నుంచి డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. ఏ పోలీసు స్టేషన్ చరిత్ర ఏమున్నది గర్వకారణం అని మీడియా పాట గడుతోందిప్పుడు.
 
 
జోధ్‌పూర్‌లో గతవారం పోలీసులు మాదక ద్రవ్యాలు కలిగిన ఉన్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద కిలో ఓపియం డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతన్ని విడిపించుకొనేందుకు అతని భార్య కాళ్లావేళ్లా పడింది. ఆమెకు సాయం చేసేందుకు ఓ పోలీసు ముందుకొచ్చాడు. అతన్ని తాను విడిపిస్తానని, కానీ అందుకు ప్రతిగా తనతో పడకగదికి రావాలని వికృత ఆఫర్‌ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది.
 
జోధ్‌పూర్‌లోని రాజీవ్‌గాంధీ పోలీసు స్టేషన్‌లో కమల్‌దాన్‌ చరణ్‌ స్టేషన్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న కేసులో ఇటీవల ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతన్ని విడిపించుకునేందుకు అతని భార్య స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ చరణ్‌ను ఆశ్రయించింది.  ఆమెకు సహకరించేందుకు ఒప్పుకున్న అతను ఇందుకు ప్రతిగా రూ. 2 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. 
 
ఆమె ఎలాగోలా కష్టపడి లక్ష రూపాయలు అతనికి ముట్టజెప్పింది. మరో లక్ష కోసం చెక్కు ఇవ్వజూపింది. అందుకు ఒప్పుకోని ఆ పోలీసు డబ్బు ఇవ్వలేకపోతే, తనకు ఓ రాత్రి శారీరక సుఖాన్ని ఇవ్వాలని, అలా చేస్తే నీ భర్తను వెంటనే విడిపిస్తానని చెప్పాడు. అతని ప్రతిపాదనతో షాక్‌ తిన్న ఆమె వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. 
 
ఆమె చెప్పిన వివరాల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆమె నుంచి డబ్బు తీసుకుంటుండగా పోలీసు కమల్‌దాన్‌ చరణ్‌ను రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు.