Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మైనర్ కుర్రాడి చేతి వేళ్ళను తొలగించిన వైద్యుడికి రూ.4.5లక్షల జరిమానా

బుధవారం, 30 నవంబరు 2016 (09:10 IST)

Widgets Magazine
doctor

ఓ మైనర్ కుర్రాడి చేతి రెండు వేళ్ళను అతని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తొలగించిన వైద్యుడి పట్ల ఢిల్లీ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీవ్రంగా స్పందించింది. డాక్టర్‌కు భారీ జరిమానా విధించింది. బాధిత కుర్రాడి కుటుంబానికి రూ. 4.5 లక్షల పరిహారం చెల్లించాలని  ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లో ఎ.కె.సర్కార్ అనే డాక్టర్.. 2004లో సంపత్ కుమార్ అనే బాలుడి చేతి రెండు వేళ్ళు ఆపరేషన్ చేసి తీసేశాడు. ఓ మిల్లులో రంపపు మిషన్‌లో ప్రమాదవశాత్తూ తన కొడుకు చెయ్యి పడిపోగా అతని తండ్రి డాక్టర్ సర్కార్ నిర్వహిస్తున్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.
 
అక్కడ సంపత్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోకుండానే సర్కార్ అతని రెండు వేళ్ళు తొలగించాడు. దీంతో సంపత్ తండ్రి కోర్టుకెక్కాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్కార్ ఈ క్రిమినల్ కేసులో దోషి అని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దాన్ని సర్కార్ సవాలు చేయగా ఆ పిటిషన్‌ను కమిషన్ కొట్టివేసింది.

తను సంపత్ చేతి వేళ్ళను తొలగించలేదన్న డాక్టర్ వాదన నమ్మదగినదిగా లేదని కమిషన్ అభిప్రాయపడింది. సంపత్ కుటుంబానికి నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్.. నిఖిల్ రెడ్డి వాకర్ లేకుండా నడుస్తున్నాడోచ్..

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ...

news

గాలి జనార్థన్ రెడ్డి కూతురి వివాహం.. ఐటీకి లెక్కలు చెప్పిన మైనింగ్ కింగ్.. కొన్నిచోట్ల పొంతన లేదట..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహన్ని ...

news

సీఆర్డీఏలో పారదర్శకతకు పెద్దపీట

అమరావతి: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో పారదర్శకత ...

news

చింత చచ్చినా పులుపు చావలా... పదవీ విరమణ చేస్తూ భారత్‌కు వార్నింగ్... పాక్ ఆర్మీ చీఫ్

మన పెద్దలు కొంతమంది చేసే పనులు, మాట్లాడే మాటలను బట్టి సామెతలు చెప్పారు. పాకిస్తాన్ ...

Widgets Magazine