గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (13:11 IST)

మహిళలు పురుడు పోసుకోవడానికి ఆ గ్రామంలో పెద్దలు ఒప్పుకోరట...

ఓ బిడ్డకు జన్మనివ్వడమనేది మహిళకు మరో జన్మలాంటిదని పెద్దలు అంటుంటారు. నిజానికి గర్భిణీ స్త్రీలను కుటుంబసభ్యులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. ఎందుకంటే... తమ ఇంటికి వారసుడు, వారసురాలిని తీసుకొస్తుం

ఓ బిడ్డకు జన్మనివ్వడమనేది మహిళకు మరో జన్మలాంటిదని పెద్దలు అంటుంటారు. నిజానికి గర్భిణీ స్త్రీలను కుటుంబసభ్యులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. ఎందుకంటే... తమ ఇంటికి వారసుడు, వారసురాలిని తీసుకొస్తుందని ఆనందంలో ఉబ్బితబ్బివవుతారు. అలాంటిది ఒక గ్రామంలో మహిళలు పురుడు పోసుకోవడానికి మాత్రం ఆ ఇళ్లల్లో పెద్దలు ఒప్పుకోరట. 
 
ఎందుకంటే ఆ గ్రామంలో శిశువు పుడితే చనిపోతాడని వారి గట్టి నమ్మకం. ఆ వివరాలను పరిశీలిస్తే...మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 70కి.మీ దూరంలో రాజ్‌గఢ్‌ ప్రాంతంలోని సంక్‌ జాగిర్‌ గ్రామస్థులు ఈ మూఢాచారాన్ని పాటిస్తున్నారు. దాదాపు 1200 మంది జనాభా ఉండే ఆ గ్రామంలో మహిళకు నెలలు నిండితే వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పురుడు పోస్తారు. 
 
గ్రామంలో పురుడు పోసుకుంటే పుట్టిన బిడ్డ చనిపోవడమో.. లేదా అంగవైకల్యంతో పుడతారని వారి అపనమ్మకం. ఈ గ్రామంలో గర్భిణీలు నెలలు నిండగానే పురుడు కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్తారు. గత యాభై సంవత్సరాలుగా ఈ ఆచారం అమల్లోనే ఉంది. అయితే ఈ మూఢనమ్మకాల నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చేందుకు ఆ గ్రామసర్పంచి నరేంద్ర సింగ్‌ గుర్జార్‌ ప్రయత్నిస్తున్నాడు. గ్రామంలో గర్భిణీల కోసం ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌(పీహెచ్‌సీ) సహాయంతో అత్యాధునిక సౌకర్యాలతో మెటర్నిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.